అరేయ్ వెధవ.. బుద్ది తెచ్చుకో.. చీరేస్తాం.. కత్తి మహేశ్‌పై గబ్బర్ సింగ్ గ్యాంగ్ ఫైర్

0
38

బిగ్‌బాస్ కంటెస్టెంట్, సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌పై గబ్బర్ సింగ్ గ్యాంగ్ సభ్యులు మాటల తూటాలు పేల్చారు. సినిమా పరిశ్రమను నాశనం చేయాలనుకుంటావా అని కత్తిని తీవ్రంగా మందలించారు. గబ్బర్ సింగ్ చిత్రంలో రౌడీ మూక సభ్యులుగా నటించిన కొందరు మాట్లాడిన వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నది. వీరి వీడియోకు స్పందించిన కత్తి మహేశ్ కూడా అంతే మొత్తంలో పవన్ ఫ్యాన్స్‌కు సవాల్ విసిరారు.

గబ్బర్ సింగ్ గ్యాంగ్ సభ్యుల్లో ఒకరు మాట్లాడుతూ.. నీ రివ్యూల వల్ల సినిమా నిర్మాతలు ఎంత నష్టపోతున్నారో తెలుసా? అప్పులు తెచ్చి, రకరకాల కష్టాలు పడి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తే అర్ధగంట సినిమా చూసి బాగాలేదని మాట్లాడుతుంటావు. సినిమా పరిశ్రమలో ఆర్టిస్టులు, సిబ్బంది, చాలా విభాగాల వారికి కష్టాలు వస్తున్నాయి. వారికి పని దొరకడం లేదు. ఇలాంటి విషయాలు తెలుసుకోనైనా కాస్త బుద్ది తెచ్చుకో అని అన్నారు.

అరేయ్.. ప్రపంచమే గుర్తించి పవన్ కల్యాణ్‌కు అవార్డు ఇచ్చారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని చెడుగా మాట్లాడటానికి ఎలా నోరు వచ్చింది. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే పది నిమిషాల్లో సినిమా బాగాలేదు. అట్లా తీశారు. అసలు సినిమా గురించి తెలుసా.. అలాంటి ముఖమేనా అని మరో సభ్యుడు ప్రశ్నించారు.

పవన్ గురించి మాట్లాడిన మాటలు అసలు బాగాలేవు. ఆయనపై చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలి. లేకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. పవన్ ఎలాంటి వాడో ప్రపంచానికి మొత్తం తెలుసు. ఆయనకు ఉట్టిగానే ఇంత పేరు రాలేదు. షో పుటప్ చేసుకొనే మనిషి కాదు అని మరో సభ్యుడు తీవ్రంగా స్పందించారు.

క్యారెక్టర్ బాగానే లేనందునే నిన్ను బిగ్‌బాస్ నుంచి తీసివేశారు. నీవు ప్రముఖులపై కామెంట్లు చేసి పాపులారిటీ సంపాదించాలని ప్రయత్నిస్తున్నావు. అందుకే నీవు పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేస్తున్నావు. చాలా తప్పు చేస్తున్నావు. పవన్ ఎవరో తెలుసా.. ఆయన దేవుడు. ఒక్క సినిమా కోసం కోట్ల రెమ్యునరేషన్ తీసుకొనే ఆయన ప్రజల కోసం రాజకీయాల్లోకి వస్తున్నాడు అని గబ్బర్ సింగ్ సభ్యులు మాటలతో ఎటాక్ చేశారు.

గతంలో ఒక్కో సినిమా 50 రోజులు నడిచేవి. నీలాంటోడు లేకనే అప్పుడు సినిమాలు నడిచాయి. సినిమా బాగాలేదు. హీరోయిన్ మైనస్, హీరో మైనస్ అంటూ వ్యాఖ్యలు చేయడం తప్పు. అందుకే ప్రేక్షకులు సినిమాలు చూడటం లేదు.

ఇండస్ట్రీలో 24 విభాగాలు బతుకుతాయి. అది నీకు తెలుసా? నాకు పవన్ ఒక్క అవకాశం ఇవ్వడం వల్ల నేను ఇప్పుడు 100 సినిమాలు చేస్తున్నాను. అలాంటి గొప్పతనం పవన్ కల్యాణ్‌ది. పవన్ కల్యాణ్ గురించి తప్పుగా మాట్లాడితే.. అరే కత్తిగా నీ నాలుక చీరేస్తా. అర్థమవుతుందా?. సినిమాల గురించి తప్పుగా మాట్లాడితే నీ సంగతి చూస్తాం.

సినిమాకు 2 పాయింట్లు ఇస్తున్నా. మూడు లైకులు. నాలుగు డిస్‌లైక్‌ల కోసం నీవు చేసే పని సరికాదు. ఇండస్ట్రీలో ఎంత మంది నిర్మాతల ఉసురు పోసుకుంటున్నావో తెలుసా? ఎంతమంది కార్మికుల పొట్టకొడుతున్నావో అది తెలుసా? ఇప్పుడైనా మారు. వెధవ అంటూ కామెంట్ చేశారు.

సినిమాలపై, హీరోలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలుగు రాష్ట్రాలో ఉన్న అభిమానులే కాదు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు నిన్ను ఏం చేస్తారో చూసుకో. తప్పు చేశానని పవన్ కాళ్లు మొక్కు లేదా.. ఏం జరుగుతుందో వేచిచూడు అని గబ్బర్ సింగ్ బ్యాచ్ నిప్పులు చెరిగారు.

అయితే తనపై కొందరు చేస్తున్న విమర్శలపై కత్తి మహేశ్ స్పందించారు. తనపై మాటల దాడి ఆపకపోతే నేను కూడా రంగంలోకి దిగాల్సి వస్తుంది. నేనేంటో, నా స్థాయి ఏంటో మీకు చూపిస్తాను అని కత్తి సోషల్ మీడియాలో స్పందించారు.

Source: Filmbeat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here