అనుష్క అందం కోసం 5 కోట్లా?

0
47
ansuhka-bhagmati
ansuhka-bhagmati

బాహుబలి సుందరి అనుష్క నటన  ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ గా ఉన్న అనుష్క తన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని బాగానే పెంచుకుంది. మూడు పదుల వయసు దాటినా కూడా  అందంలో ఏ మాత్రం తగ్గలేదు స్వీటీ. అయితే బాహుబలి తర్వాత ఇంతవరకు ఒక్క సినిమాను కూడా రిలీజ్ చెయ్యలేదు. ప్రస్తుతం బాగమతి అనే ఒక్క సినిమాతో బిజీగా ఉంది.

పిల్ల జమిందార్ దర్శకుడు జి. అశోక్ ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విజువల్ వండర్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. అయితే సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం దర్శకుడు గ్రాఫిక్స్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడు. యువి క్రియేషన్స్ ఆ సినిమాను తెరకెక్కిస్తోంది. అయితే సినిమాకి బడ్జెట్ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఖర్చయ్యిందట. అలాగే రీసెంట్ గా అనుష్క ఫిట్ నెస్ లోపం వల్ల సినిమాకి కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని ఆమె శరీర ఆకృతిని గ్రాఫిక్స్ తో అందంగా కనిపించేలా కవర్ చేసినట్లు తెలుస్తోంది.

కేవలం అనుష్క లుక్ కోసమే నిర్మాతలు 5 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం. అయితే దర్శకుడు ఇంతవరకు సినిమాకి సంబంధించిన ఒక్క లుక్ ని కూడా రెడీ చెయ్యలేదు. అసలు ఆ సినిమా ఉందా లేక ఆగిపోయిందా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సినిమా అయితే రెడీ అవుతోందని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. మరి రిలీజ్ చేసే ముందైనా చెబుతారా లేదా అనే కామెంట్స్ కూడా కొందరు చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here