సెలీనా జైట్లీ ఇంట విషాదం

0
24

సంషేర్ ఇక లేడని పుట్టిన ఇద్దరు కవల పిల్లల్లో ఒక పిల్లాడు మృతిచెందాడు. పుట్టుకతోనే గుండె సంబంధ వ్యాధితో జన్మించడంతో ఇద్దరు మగపిల్లల్లో ఒకడు చనిపోయాడు. ఈ విషయాన్ని సెలీనా అఫీషియల్ గా ప్రకటించింది. ఆర్థర్, సంషేర్ అనే తన కవల పిల్లల్లో సంషేర్ ఇక లేడని ప్రకటించింది సెలీనా.

ఇటీవల కవలలకు జన్మనిచ్చిన బాలీవుడ్‌ నటి సెలీనా జైట్లీ ఇంట విషాదం నెలకొంది. బాలీవుడ్ బ్యూటీ సెలీనా జైట్లీ పెళ్లి చేసుకొని లండన్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే. గత నెల 10వ తేదీన ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది ఈ బ్యూటీ. ఈ గుడ్ న్యూస్ అప్పట్లో సెలీనా అభిమానులతో పాటు ఆమె కుటుంబంలో ఆనందం నింపింది. అయితే నెల రోజులు కూడా గడవకముందే సెలీనా ఇంట విషాదం అలుముకుంది.
తండ్రి క‌ల్న‌ల్ విక్ర‌మ్ కుమార్ జైట్లీ మ‌ర‌ణం

తండ్రి క‌ల్న‌ల్ విక్ర‌మ్ కుమార్ జైట్లీ మ‌ర‌ణం పుట్టుకతోనే తీవ్ర హృదయ సంబంధ సమస్యతో జన్మించిన బాబు, చనిపోయాడని సెలీనా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది. రెండు నెల‌ల క్రితమే తండ్రి క‌ల్న‌ల్ విక్ర‌మ్ కుమార్ జైట్లీ మ‌ర‌ణంతో కుంగిపోయిన బాలీవుడ్ న‌టి సెలీనా జైట్లీ ఇంట మ‌రో విషాదం చోటు చేసుకుంది.
 జ‌న్మ‌నిచ్చిన క‌వ‌ల‌ల్లో

జ‌న్మ‌నిచ్చిన క‌వ‌ల‌ల్లో ఇటీవ‌ల రెండో కాన్పులో తాను జ‌న్మ‌నిచ్చిన క‌వ‌ల‌ల్లో ఒక‌రు చ‌నిపోయారు. తీవ్ర హృద‌య సంబంధ స‌మ‌స్య కార‌ణంగా త‌న బాబు చ‌నిపోయాడ‌ని సెలీనా ఫేస్‌బుక్ ద్వారా వెల్ల‌డించింది. ఈ విష‌యంపై ఆమె తీవ్ర ఆవేద‌న‌కు గురైంది. తొలి కాన్పులోనే సెలీనా దంపతులకు కవలలే జన్మించారు.
విన్ స్టన్, విరాజ్

విన్ స్టన్, విరాజ్ 35 ఏళ్ల సెలీనాకు తొలి కాన్పులో జన్మించిన విన్ స్టన్, విరాజ్ లకు ప్రస్తుతం ఐదేళ్లు. సెప్టెంబర్ 10న మరోసారి కవలలకు జన్మనిచ్చిన ఆనందం వారి ఇంట ఎన్నో రోజులు నిలవలేదు. వారిలో ఒక బాబు మరణించటం సెలీనా ఇంట్లో విషాదం నింపింది.

Source: filmbeat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here