జై లవ కుశ’ తర్వాత ఎన్టీఆర్ పాత్ర ఏదంటే

0
24

జై లవ కుశ’ చిత్రంలో చేసిన త్రిపాత్రాభినయంతో అందరి హృదయాల్నీ దోచుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌.. తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌కు పెట్టింది పేరైన త్రివిక్రమ్‌.. ఈ చిత్రాన్నీ అదే తరహాలో రూపొందించనున్నారు. ఇందులో తారక్‌ ఆర్మీ అధికారిగా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది దేశభక్తి నేపథ్య చిత్రం కాదనేది విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఈ చిత్రానికి ప్రధానాకర్షణ తారక్‌ పాత్రేననీ, ‘జై లవ కుశ’లో మూడు భిన్న తరహా పాత్రల్ని సునాయాసంగా పోషించిన ఆయనకు ఈ పాత్ర మరింత పేరు తెస్తుందని అంటున్నారు. వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు పొందుతోన్న అను ఇమ్మాన్యుయేల్‌ ఈ సినిమాలో తారక్‌ జోడీగా కనిపించనున్నది. ప్రస్తుతం ఆమె త్రివిక్రమ్‌ దర్శకత్వంలోనే పవన్‌ కల్యాణ్‌ సరసన నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆ సినిమా పూర్తవగానే తారక్‌ సినిమాని డైరెక్ట్‌ చేయనున్నారు త్రివిక్రమ్‌.

Source:andhrajyothi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here