కోలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ గా రాబోతున్న విక్రమ్‌ వారసుడు ధృవ్‌ ..!

0
25

గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా బాగా పెరిగిపోయింది. తాజాగా మరో సూపర్ స్టార్ హీరో తనయుడు సినీరంగ ప్రవేశం చేస్తున్నాడు. శివపుత్రడు, అపరిచితుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ‘చియాన్‌’ విక్రమ్‌. తెలుగు లో ఒకటీ రెండు సినిమల్లో నటించిన విక్రమ్ కి పెద్దగా పేరు రాలేదు.

తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ హీరోకి వరుస విజయాలు రావడంతో ఒక్కసారే స్టార్ హీరోగా మారిపోయాడు. విశ్వనటుడు కమల్ హాసన్ తర్వాత ఆ రేంజ్ లో ప్రయోగాత్మక పాత్రల్లో నటించింది విక్రమ్ ఒక్కడే. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘చియాన్‌’ విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా రాబోతున్నాడు. కాకపోతే ఈ హీరో తమిళ వెండి తెరపై మాత్రమే కనిపించబోతున్నాడు.

మరి తెలుగులోకి ఎప్పుడు తీసుకొస్తారో..విక్రమ్. తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవరకొండ విజయ్ నటించిన ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్‌తో ధృవ్‌ హీరోగా పరిచయం కానున్నట్టు స్వయంగా విక్రమ్‌ వెల్లడించారు.

‘రెడీ టు మేక్‌ ద లీప్‌. ధృవ్‌ టు బి అర్జున్‌రెడ్డి’ అని తనయుడి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో విక్రమ్‌ పోస్ట్‌ చేశారు. ఎప్పట్నుంచో ధృవ్‌ విక్రమ్‌ ఎంట్రీ గురించి వార్తలొస్తున్నాయి. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన విక్రమ్ వారసుడు మరి ఏ రేంజ్ లో అదరగొడతాడో వేచి చూడాలి.

Source : APherald

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here