స్పైడ‌ర్’ స‌క్సెస్ మీట్‌కి మ‌హేష్ ‘నో’

0
46
త‌న సినిమాల‌పై ఎప్పుడూ నిక్క‌చ్చిగానే వ్య‌వ‌హ‌రిస్తాడు మ‌హేష్ బాబు. సినిమా హిట్ట‌యితే… బ‌య‌ట‌కు వ‌చ్చి ‘మా సినిమా బాగా ఆడుతోంది.. ఇంకా ఇంకా చూడండి’ అని చెప్పే మ‌హేష్ – కాస్త డివైడ్ టాక్ వ‌చ్చినా అస్స‌లు క‌నిపించ‌డు. ‘బ్ర‌హ్మోత్స‌వం’ ఫ్లాప్ అయ్యాక కొన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు మ‌హేష్‌. ఇప్పుడు స్పైడ‌ర్ విష‌యంలోనూ అంతే. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ‘స్పైడ‌ర్’ అటు చిత్ర‌సీమ‌నీ, ఇటు మ‌హేష్ అభిమానుల్నీ తీవ్రంగా నిరాశ ప‌రిచింది.
 

వ‌సూళ్లు ఓకే అనిపించినా – బ‌య్య‌ర్లు న‌ష్ట‌పోయే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. ఇక ద‌స‌రా సెల‌వ‌లు కూడా అయిపోయాయి. మున్ముందు థియేట‌ర్లు మ‌రింత ప‌లుచ‌న‌బ‌డ‌డం ఖాయం. ద‌స‌రా సీజ‌న్‌ని క్యాష్ చేసుకోవ‌డానికీ, డివైడ్ టాక్‌ని త‌గ్గించ‌డానికి విడుద‌ల త‌ర‌వాత‌.. స‌క్సెస్ మీట్ నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేశారు. విశాఖ‌, విజ‌య‌వాడ, హైద‌రాబాద్‌ల‌లో ఓ చోట స‌క్సెస్ మీట్‌ని గ్రాండ్ గా చేయాల‌ని అనుకొన్నారు. అయితే… డివైడ్ టాక్ చూసిన మ‌హేష్ స‌క్సెస్ మీట్‌కి నో చెప్పేశాడు. త‌న సినిమా పూర్త‌య్యాక ఫారెన్ ట్రిప్‌కి వెళ్ల‌డం మ‌హేష్ అల‌వాటు. ట్రిప్‌కి వెళ్లేలోగా.. ఓ ఫంక్ష‌న్‌ని నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేశారు. అయితే ఇలాంటివేం పెట్టుకోవ‌ద్ద‌ని చెప్పిన మ‌హేష్‌.. ఇప్పుడు ఫారెన్ ట్రిప్‌కి వెళ్లిపోయాడు. మ‌హేష్ తిరిగొచ్చేది రెండు వారాల త‌ర‌వాతే. మ‌హేష్ లేకుండా స‌క్సెస్ మీట్ నిర్వ‌హించినా అర్దం లేదు. అందుకే.. స్పైడ‌ర్ టీమ్ కూడా ఈ మాట ఎత్త‌డం లేదిప్పుడు.

Source : Telugu360

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here