రెండో పెళ్లిపై పవన్ రియాక్షన్ చెప్పిన రేణు

0
33
Pawan Kalyan-Renu Desai Love Story
Pawan Kalyan-Renu Desai Love Story

విడిపోయిన తర్వాత కూడా ఫ్రెండ్స్ గా ఉండటం చాలాతక్కువ మందిలో చూస్తుంటాం. ఏళ్లకు ఏళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత విడిపోతే చాలు.. అప్పటివరకు ఉన్న బంధం కరిగిపోయి ఆరోపణలు.. తప్పులు ఎత్తి చూపించటం లాంటివి కనిపిస్తాయి. కానీ.. పవన్ కల్యాణ్.. రేణుదేశాయ్ ఎపిసోడ్లో మాత్రం అలాంటివి మచ్చుకు కనిపించవు.

బయట వినిపించే మాటల్ని పక్కన పెడితే.. ఇద్దరూ ఒకరిపై ఒకరు అభిమానంగా ఉండటం.. స్నేహంగా ఉండటంతో పాటు.. పిల్లల విషయంలో ఉమ్మడిగా బాధ్యత నెరవేర్చటం కనిపిస్తుంటుంది.

ఇంటర్వ్యూలు ఇవ్వటం.. కెమేరా ముందుకు రావటం పవన్ తో అయ్యేది కాదు. ఆ మాటకు వస్తే తన వ్యక్తిగత విషయాల్ని చెప్పుకోవటానికి పవన్ అస్సలు ఇష్టపడరు. అయితే.. రేణు మాత్రం తనకు సంబంధించిన విషయాల్ని ఓపెన్ గా చెబుతుంటారు. అది కూడా ఏదో చెప్పాలన్నట్లు కాక.. ఆమె మాటలు ఇంప్రెసివ్ గా ఉంటాయి.

తాజాగా ఒక ప్రముఖ ఛానల్ లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన రేణు.. తన రెండో పెళ్లిపై పవన్ స్పందనను వెల్లడించారు. ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో తాను రెండో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పిన రేణు.. తాజా ఇంటర్వ్యూలో కొనసాగింపుగా పలు విషయాలు వెల్లడించారు. తాను లవ్ మ్యారేజ్ చేసుకోనని.. సినిమా.. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారిని వివాహమాడనని చెప్పిన ఆమె.. కామ్ గా.. సెటిల్డ్ గా ఉండే రంగానికి చెందిన వ్యక్తిని పెళ్లాడతానని చెప్పారు.

తన రెండో పెళ్లి విషయం గురించి తెలిసిన పవన్ తనకు ఫోన్ చేశారని.. ఆల్ ద బెస్ట్ చెప్పారని.. ఎంపిక చేసుకునేటప్పుడు కాస్త ఆచితూచి చూసుకోవాలని సూచన చేశారని చెప్పారు. పిల్లలు ఉన్నారు.. జాగ్రత్తగా ఉండమన్నారని.. తాను కూడా చెక్ చేసుకుంటానని చెప్పానని రేణు చెప్పారు.

పవన్.. తాను విడిపోయే సమయంలో పవన్ నుంచి తాను చాలా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లుగా పవన్ అభిమానుల్లో కొందరు చేస్తున్న ఆరోపణ మీద అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన రేణు.. అందులో నిజం లేదన్నారు. తమకు అమెరికాలో ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారని.. చాలాకాలంగా తెలుసని.. పవన్ తో విడిపోయిన తర్వాత ఏడాది వరకూ తనతో మాట్లాడలేదన్నారు.

ఒకసారి తనకు ఫోన్ చేసిన ఆయన.. మొహమాట పడుతూనే.. విడాకుల సమయంలో తాను డబ్బులు తీసుకున్న విషయాన్ని ప్రస్తావించారని.. మీరు కూడా ఆ మాటల్ని నమ్మారా? అని అడిగానని.. ఆయన నోటి నుంచి ఆ మాటలు విన్నప్పుడు తన బాడీ షివర్ అయిపోయినట్లు రేణు చెప్పారు. ఇప్పటికే మూడు మ్యాచ్ లు వచ్చాయని.. ఒకరిని ఫార్మల్ గా కలిసినట్లు చెప్పారు. పెళ్లికి సంబంధించి కొన్ని మాటలు మాట్లాడుకున్నట్లు చెప్పారు. ఇంకా ఏమీ తేలలేదని.. పెళ్లి చేసుకున్న పక్షంలో తప్పనిసరిగా పూలదండలతో ఉన్న చక్కటి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here