అనుష్కతో ఎఫైర్ పై ప్రభాస్ రియాక్షన్

0
28

కొన్నికొన్ని కాంబినేషన్ లు ఎవర్ గ్రీన్ గా వుంటాయి. ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమానం చొరగుంటాయి. వీళ్ళ కోసమే ఈ సినిమా పుట్టిందా..ఆ పాత్రలు వెనుక ఏనాటి అనుబంధం వుందో అనిపించేస్తాయి. ఇప్పుడీ వరుసలో లో ప్రభాస్ అనుష్క లను కూడా చేర్చేయొచ్చు.

అనుష్క ప్రభాస్ లది అదిరిపోయే జోడి. ఇప్పటివరకూ మూడు సినిమాల్లో జోడి కట్టారు ప్రభాస్ ,అనుష్క. బిల్లా , మిర్చి , బాహుబలి. ఈ మూడు కూడా సూపర్ హిట్లే. బాహుబలి ఐతే ఏకంగా సంచలనం సృష్టించింది. దేవసేనగా ప్రభాస్ భుజాలెక్కేసింది స్వీటీ.

అయితే వీరి మధ్య లవ్ ఎఫైర్ వుందని కూడా బోలెడు చక్కర్లుకొట్టాయి. అయితే ఈ వార్తలపై ఎప్పుడూ స్పదించలేదు వీరిద్దరూ. తాజాగా ప్రభాస్ ఈ విషయంలో రియాక్ట్ అయ్యాడు. ” అనుష్క నాకు చాలా కాలంగా తెలుసు. సినిమా కాకుండా మా మధ్య మంచి స్నేహం కూడా వుంది. స్వీటీ కుటుంబం అంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా గురించి వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు.

ఇది కేవలం రాసేవాళ్ళ ఉహ మాత్రమే” అని క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్.

Source : Telugu mirchi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here