అప్పటి చేదు అనుభవాల వల్లే “అర్జున్ రెడ్డి” చేయనని చెప్పా: శర్వానంద్

0
40
శర్వానంద్ ఆ గుట్టు విప్పాడు ఇంతా అయ్యాక తానే విషయం చెప్పెయ్యాలి అనుకున్నాడేమో తాజాగా శర్వానంద్ ఆ గుట్టు విప్పాడు. తాను పెట్టిన కండిషన్ వల్లే సందీప్ తనతో ‘అర్జున్ రెడ్డి’ చేయలేకపోయాడని చెప్పేసాడు. నిజానికి సందీప్ చెప్పినప్పుడే ‘అర్జున్ రెడ్డి’ కథ విపరీతంగా నచ్చిందని.. దీని మీద ఒక వర్క్ షాప్ కూడా చేసి ఆ తర్వాత షూటింగుకి వెళ్లాలని కూడా అనుకున్నాడట.

శర్వానంద్ చేయాల్సింది సినిమాను వాస్తవానికి శర్వానంద్ చేయాల్సింది. ముందుగా దర్శకుడు సందీప్ రెడ్డి శర్వాకే చెప్పాననీ. కానీ అనివార్య కారణాల వల్ల శర్వాతో సినిమా చేయలేకపోయానని ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లోనే చెప్పాడు సందీప్. అప్పటికే విజయ్ అర్జున్ రెడ్డి మీద తన మార్క్ వేసేసాడు. అయితే శర్వాతో సినిమా చేయలేకపోవటానికి కొన్ని కారణాలున్నాయి అన్నాడేకానీ ఆ అనివార్య కారణాలేంటన్నది సందీప్ వంగా వెల్లడించలేదు.

 
అశ్వినీదత్‌తో పాటు మరో నిర్మాత అశ్వినీదత్‌తో పాటు మరో నిర్మాత అయితే ‘అర్జున్ రెడ్డి’ సినిమాను సందీప్ స్వీయ నిర్మాణంలో చేయాలనుకోవటం తో ఆ విషయంలోనే తాను అభ్యంతర పెట్టానని, సినిమా క్వాలిటీకోసం అశ్వినీదత్‌తో పాటు మరో నిర్మాతను కూడా తాను కలిసే ఏర్పాటు చేశానని. కానీ అవేవీ వర్కవుట్ కాకపోవటం, సందీప్ తనే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాననడంతో సినిమా అనుకున్నట్టు రాకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని శర్వా తప్పుకున్నాడట. కుదరదని చెప్పేసాడట
Source: Filmbeat

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here