సాయిధరమ్‌తేజ్‌, వి.వి.వినాయక్‌, సి.కళ్యాణ్‌ చిత్రానికి ఎస్‌.ఎస్‌.థమన్‌ మ్యూజిక్‌

0
28
సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ షెడ్యూల్‌లో ఒక యాక్షన్‌ సీన్‌, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. కాగా, ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.థమన్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంపిక చేశారు.
thaman-saidharam tej
thaman-saidharam tej

ఈ షెడ్యూల్‌ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి, నల్లవేణు, భద్రం, వెంకీ, రాహుల్‌ రామకృష్ణ, నాజర్‌, జె.పి., రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, ఆకుల శివ, ఆశిష్‌ విద్యార్థి, పవిత్ర లోకేష్‌, కాశీ విశ్వనాథ్‌, బ్రహ్మానందం, ఫిష్‌ వెంకట్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, మేకప్‌: బాషా, కాస్ట్యూమ్స్‌: వాసు, స్టిల్స్‌: శ్రీను, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌: జి.జి.కె.రాజు, సతీష్‌ కొప్పినీడి, ఫైట్‌మాస్టర్‌: వెంకట్‌, కో-డైరెక్టర్స్‌: సూర్యదేవర ప్రభాకర్‌నాగ్‌, పుల్లారావు కొప్పినీడి, కో-ప్రొడ్యూసర్స్‌: సి.వి.రావు, పత్సా నాగరాజ, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వి.వి.వినాయక్‌.

Source : Telugu360

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here